Share News

విజయాలకు సంకేతం దీపావళి

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:55 AM

దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

విజయాలకు సంకేతం దీపావళి

  • గవర్నర్‌, సీఎం, డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు

అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘దీపావళి పండుగ చీకటిపై కాంతి, చెడుపై మంచి, ఆజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి సంకేతంగా నిలుస్తుంది’ అని గవర్నర్‌ తన సందేశంలో పేర్కొన్నారు. ‘ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలి. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలి’ అని సీఎం పేర్కొన్నారు. ‘దీపావళి పర్వదినాన ప్రజలందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు, శుభాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని పవన్‌ పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 01:59 AM