Share News

గిరిజన సంక్షేమానికి 21.86 కోట్ల నిధులు

ABN , Publish Date - Sep 18 , 2026 | 04:26 AM

గిరిజన సంక్షేమశాఖ పరిధిలో 12 పనులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం అందించే గ్రాంట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. వాటికి మొత్తం రూ.21.86కోట్లు అవుతుందని అంచనా వేశారు.

గిరిజన సంక్షేమానికి 21.86 కోట్ల నిధులు

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమశాఖ పరిధిలో 12 పనులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం అందించే గ్రాంట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. వాటికి మొత్తం రూ.21.86కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ నిధులతో పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఏటీడబ్ల్యూఆర్‌ బాలుర పాఠశాలకు అదనపు తరగతి గదుల నిర్మాణం, పార్వతీపురంలో మౌలిక వసతులు, పాడేరు ప్రాంతంలోని రెండు గిరిజన సంక్షేమ పాఠశాలలకు అదనపు మౌలిక వసతులు, రంపచోడవరంలోని ఏపీటీడబ్ల్యూఆర్‌జేసీకి అదనపు మౌలిక వసతులు, చింతూరు ప్రాంతంలోని మూడు పాఠశాలల్లో భోజనశాలలు, వంటగదులు, జీలుగుమిల్లి ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో డార్మిటరీ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అలాగే పాణ్యం బాలుర హెచ్‌సీఆర్‌ఎస్‌కు కొత్త భవనాల నిర్మాణం, నెల్లూరు జిల్లాలోని గొలగమూడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు అదనపు వసతులు నిర్మించనున్నారు. నెల్లూరులోని ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్‌కు అదనపు మౌలిక వసతుల కోసం రూ.1.60కోట్లు మంజూరుచేశారు. ఈ పనులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌, చీఫ్‌ ఇంజనీర్‌లను ప్రభుత్వం ఆదేశించింది.

ఈ వార్తలనూ చదవండి:

భలే మంచి బేరం !

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

Updated Date - Sep 18 , 2026 | 04:26 AM