నూతన ఐఏఎస్‌ల పోస్టింగ్‌లు నిలిపివేత
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:21 AM
ఆలిండియా సర్వీసెస్ 2024 బ్యాచ్ అధికారులకు పోస్టింగ్స్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం నిలిపివేసింది. ఏడుగురు ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఆలిండియా సర్వీసెస్ 2024 బ్యాచ్ అధికారులకు పోస్టింగ్స్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం నిలిపివేసింది. ఏడుగురు ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సందీప్ రఘువంశీని తెనాలి సబ్ కలెక్టర్‌గా, కె.చిరంజీవి నాగవెంకట సహితను పాడేరు సబ్ కలెక్టర్‌గా, డి.పృథ్వీ రాజ్‌కుమార్‌ను రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా, చిట్టిపులి నరేంద్ర పడాల్‌ను చింతూరు సబ్ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా సచిన్ రాహర్‌కు, పెనుకొండ సబ్ కలెక్టర్‌గా ఫరీజ్ జహీద్‌కు, నంద్యాల సబ్‌కలెక్టర్‌గా మనిషాకు పోస్టింగ్స్ ఇచ్చింది. చింతూరు సబ్ కలెక్టర్‌గా ఉన్న 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శుభమ్ నోఖ్వాల్‌ను బదిలీ చేసి రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా నియమించింది. ఆయా సబ్ డివిజన్లల్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్లు, డీఆర్వోలను వెంటనే జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తెల్లవారేసరికి పరిస్థితి మారిపోయింది. పై నియామకాలన్నింటినీ నిలిపేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వు జారీ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
రెన్యువల్ అయ్యేలా చర్యలు చేపట్టండి