Share News

మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్.. ఆలోచిస్తున్నామన్న మంత్రి లోకేష్..

ABN , Publish Date - Jan 22 , 2026 | 06:42 PM

ఏపీలోనూ మైనర్ల సోషల్ మీడియా నిషేధంపై ఆలోచిస్తున్నామన్నారు మంత్రి నారా లోకేశ్‌. దావోస్‌ పర్యటనలో భాగంగా బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్.. ఆలోచిస్తున్నామన్న మంత్రి లోకేష్..
Andhra Pradesh Digital Policy

ఇంటర్నెట్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 16 ఏళ్లలోపు పిల్లలు ఇక సోషల్ మీడియాను వినియోగించలేరా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే, ప్రస్తుతానికి అలాంటి విధానం ఏదీ లేదు కానీ.. భవిష్యత్‌లో మాత్రం ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి నారా లోకేష్ తాజాగా చేసిన కామెంట్సే ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు. దావోస్‌ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్.. బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చిన్న పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మైనర్ల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ విధించాలని భావిస్తున్నట్లు తెలిపారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా కంటెంట్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉందని, వారి భద్రత దృష్ట్యా బలమైన చట్టపరమైన వ్యవస్థ అవసరమవుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు.


ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వాడకుండా నిషేధం విధించారు. పిల్లలు సోషల్ మీడియాను అతిగా వినియోగించడం వలన శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రభావితం అవుతున్నారు. దీనిని గమనించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్ విధించింది. భారత్‌లోనూ ఇలా చేస్తే బాగుండనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ దావోస్ వేదికగా సోషల్ మీడియా వినియోగంపై చేసిన వ్యాఖ్యలు.. మరోసారి ఆ అభిప్రాయానికి బలాన్నిచ్చినట్లయ్యింది.


తెలంగాణ సీఎంతో భేటీ..

దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్.. అక్కడే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగంలో సంస్కరణలు, ఐటీ రంగ అభివృద్ధి, యువతకు నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించారు. పెట్టుబడుల కోసం రాష్ట్రాలు వేర్వేరుగా పోటీపడుతున్నప్పటికీ, పరస్పర సహకారం, సమన్వయంతో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నిలవగలవన్న నమ్మకాన్ని లోకేశ్‌ వ్యక్తం చేశారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫోటోలను మంత్రి లోకేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


Also Read:

గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..

అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు నాటండి.!

బడ్జెట్ 2026: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ చెబుతారా.. ఈ 4 అంశాలపై సానుకూలంగా స్పందిస్తారా.?

Updated Date - Jan 22 , 2026 | 07:44 PM