Share News

అన్నీ అబద్ధాలే!

ABN , Publish Date - Nov 29 , 2026 | 02:31 AM

రాజధాని అమరావతిపై కక్షగట్టిన వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్‌ పూర్తిగా అవాస్తవాలు, అసత్యాలతో కూడిన నిరాధారమైన ఆరోపణలతో మరోమారు విషం కక్కారు.

అన్నీ అబద్ధాలే!

  • అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్‌ తప్పుడు ప్రచారం

  • చదరపు అడుగుకు రూ.30 వేల ఖర్చంటూ యాగీ

  • వాస్తవంగా అవుతున్న ఖర్చు రూ.17,339 మాత్రమే

  • ఫ్యాక్ట్‌ చెక్‌తో వాస్తవాలను వివరించిన ప్రభుత్వం

  • కావాలనే జగన్‌ తప్పుడు ప్రచారమంటూ ఖండన

గుంటూరు(రాజధాని), నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిపై కక్షగట్టిన వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్‌ పూర్తిగా అవాస్తవాలు, అసత్యాలతో కూడిన నిరాధారమైన ఆరోపణలతో మరోమారు విషం కక్కారు. రాజధానిలో కడుతున్న భవనాల నిర్మాణ వ్యయంపై తప్పుడు ప్రచారాలను అందుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దీటుగా స్పందించింది. ఫ్యాక్ట్‌ చెక్‌ ద్వారా వాస్తవాలను ప్రజల ముందుంచి, వైసీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టింది. రాజధానిలో భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.17,339 మాత్రమే అవుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే చదరపు అడుగుకు రూ.30 వేలు ఖర్చు చేస్తున్నారంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి ప్రతిష్ఠను దెబ్బతీయాలని వైసీపీ పనిగట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. చదరపు గజాలను తక్కువగా చూపుతూ చదరపు అడుగుల ధరను పెంచి చూపుతూ ఫేక్‌ ప్రాపగాండ చేస్తున్నారని సీఆర్డీఏ అధికారులు వివరించారు. అమరావతిలో 71.43 లక్షల చదరపు అడుగుల్లో రాజధాని భవనాలు నిర్మిస్తుంటే, దాన్ని 52.20 లక్షల చదరపు అడుగులు మాత్రమేనంటూ తప్పుడు లెక్కలతో దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది.


రాజధానిపై ఉద్దేశపూర్వకంగానే వైఎస్‌ జగన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. జగన్‌ ప్రభుత్వంలో విశాఖలో రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.30 వేలకు పైగా ఖర్చు చేసిన సంగతిని ప్రభుత్వం గుర్తు చేసింది. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) విధించిన ఫైన్‌ రూ.200 కోట్లు చెల్లించడం కోసం ఖజానాకు చిల్లు పెట్టిన విషయం జగన్‌కు గుర్తు లేదా అంటూ ప్రశ్నించింది. రుషికొండ ప్యాలె్‌సలోకి సందర్శకులను అనుమతించాలన్న క్యాబినెట్‌ నిర్ణయంతో అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారానికి జగన్‌ తెరలేపారని కూటమి సర్కార్‌ చెబుతోంది. రుషికొండ ప్యాలె్‌సలోకి సందర్శకులను అనుమతిేస్త తన బండారం బయటపడుతుందని జగన్‌ సొంత మీడియా ద్వారా ఫేక్‌ ప్రచారానికి దిగారని విమర్శించింది.

అమరావతి శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయంపై మూడు నెలలకోసారి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. చదరపు అడుగుకు రూ.29,340 నుంచి రూ.30,000 వరకు ఖర్చు పెడుతున్నారన్న ఆరోపణలు అవాస్తవమని తేల్చి చెప్పింది. 71.43 లక్షల చదరపు అడుగుల్లో 5 ఐకానిక్‌ ప్రభుత్వ టవర్ల నిర్మాణం మొత్తం విస్తీర్ణానికి బడ్జెట్‌ను లెక్కగడితే చదరపు అడుగుకు అయ్యే అసలు ఖర్చు రూ.17,339 మాత్రమేనని తెలిపింది. జాతీయ, ప్రాంతీయ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో పోల్చి చూసినా అమరావతి రేట్లు అత్యంత హేతుబద్ధంగా ఉన్నాయని వివరించింది. 4 అంతస్తులతో నిర్మించిన కేంద్ర పార్లమెంట్‌ భవనానికి చదరపు అడుగుకు రూ.16,916 ఖర్చయిందని గుర్తుచేసింది.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 02:36 AM