Share News

సీఎం సార్‌.. మా డబ్బులు మాకివ్వండి!

ABN , Publish Date - Sep 02 , 2026 | 04:27 AM

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన ర్ల న్యాయమైన సమస్యలు, పెండింగ్‌ బకాయిల చెల్లింపుల కోసం చేపట్టిన మొదటి దశ ఉద్యమ కార్యాచరణకు మంగళవారం నుంచి శ్రీకారం చుట్టినట్లు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మంగళవారం పేర్కొన్నారు

 సీఎం సార్‌.. మా డబ్బులు మాకివ్వండి!

  • సీఎం సార్‌.. మా డబ్బులు మాకివ్వండి!

  • సమస్యలపై మొదటి దశ ఉద్యమం ప్రారంభం

  • ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెల్లడి

అమరావతి/విజయవాడ(గాంధీనగర్‌), సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన ర్ల న్యాయమైన సమస్యలు, పెండింగ్‌ బకాయిల చెల్లింపుల కోసం చేపట్టిన మొదటి దశ ఉద్యమ కార్యాచరణకు మంగళవారం నుంచి శ్రీకారం చుట్టినట్లు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మంగళవారం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కలెక్టరేట్ల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారని తెలిపారు. ‘సీఎం సార్‌.. మా డబ్బులు మాకు ఇవ్వం డి’ అనే నినాదాన్ని ఉద్యోగులు తమ మొబైల్‌ ఫోన్లలో వాట్సాప్‌ డీపీలు, స్టేట్‌సలుగా పెట్టుకుని నిరసన తెలిపారని పేర్కొన్నారు. ఇదేవిధంగా ఈ నెల 5 వరకు నిరసన తెలుపుతామని, 3, 5 తేదీ ల్లో జిల్లా, డివిజన్‌ కార్యాలయాల వద్ద భోజన వి రామ సమయంలో ప్రదర్శనలు నిర్వహిస్తామన్నా రు. ఈ నెల 2 నుంచి 8 వరకు జేఏసీ నేతలు ప్రతి ఉద్యోగినీ కలిసి ఉద్యమానికి గల కారణాల ను వివరిస్తారన్నారు. 11న విజయవాడతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించి, అన్ని ట్రేడ్‌ యూనియన్లు, ఉద్యోగ సంఘాలను ఆహ్వానిస్తామని తెలిపారు. ఉద్యమంలో ఉద్యోగులంతా భాగస్వాములై.. సంఘాలకు ఆతీతంగా విజయవంతం చేయాలన్నారు.

ఈ వార్తలను కూడా చదవండి

పోరంబోకులో ప్రహరీ తొలగింపు

సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని

Updated Date - Sep 02 , 2026 | 04:27 AM