Share News

రాష్ట్రంలో పెరిగిన చలి

ABN , Publish Date - Nov 29 , 2026 | 02:43 AM

రాష్ట్రంలో ఒక్కసారిగా చలి పెరిగింది. ఉత్తరాది నుంచి చలిగాలులు ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు వీచాయి. ఈ ఏడాది తొలిసారిగా అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కిలగాడలో 6.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

రాష్ట్రంలో పెరిగిన చలి

  • మన్యంలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

  • ముంచంగిపుట్టులో 6.9 డిగ్రీలు నమోదు

  • రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం, పాడేరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒక్కసారిగా చలి పెరిగింది. ఉత్తరాది నుంచి చలిగాలులు ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు వీచాయి. ఈ ఏడాది తొలిసారిగా అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కిలగాడలో 6.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. రానున్న రెండురోజుల్లో చలి ప్రభావం కొనసాగి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించనున్నదని, సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 02:45 AM