Share News

నేడు మదనపల్లెలో సీఎం పర్యటన

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:59 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం మదనపల్లెలో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు జరిగే శంకుస్థాపన...

నేడు మదనపల్లెలో సీఎం పర్యటన

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం మదనపల్లెలో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి పాల్గొననున్నారు. ఉదయం 8.40 గంటలకు ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి.. 10.30 గంటలకు మదనపల్లె మండలం కొండమర్రిపల్లికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11 గంటలకు బీకే పల్లి వెళ్తారు. మదనపల్లె పర్యటన ముగించుకుని, మధ్యాహ్నం 3.25 గంటలకు అమరావతి చేరుకుంటారు. సాయం త్రం 4.45 గంటలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్‌కు వెళ్తారు. 5 గంటలకు స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 04:59 AM