అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి సీఎం అభినందనలు
ABN , Publish Date - Nov 15 , 2026 | 01:35 AM
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యర్రాజి జ్యోతి 2024 సంవత్సరానికిగాను అర్జున పురస్కారాన్ని అందుకోవడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యర్రాజి జ్యోతి 2024 సంవత్సరానికిగాను అర్జున పురస్కారాన్ని అందుకోవడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆమె మున్ముందు మరిన్ని విజయాలు సాధించి, మరెన్నో పురస్కారాలు పొందాలని ఆకాంక్షించారు. మంత్రి లోకేశ్ కూడా జ్యోతికి శుభాకాంక్షలు తెలిపారు. యర్రాజి పట్టుదలతో సాగించిన క్రీడా ప్రయాణం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం