Share News

ఆక్వారంగంలో సందిగ్ధతకు తెర

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:09 AM

ఆక్వారంగంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వా ఫార్మర్స్‌ అసోసియేషన్‌.. స్రీంప్‌ హేచరీస్‌ అసోసియేషన్‌ మధ్య గురువారం కాకినాడలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా పలు అంశాలపై తీర్మానాలు చేశారు. సీడ్‌ క్వాలిటీ శాస్త్రీయ పద్ధతిలో నాణ్యత పెంచి సరఫరా చేయాలని నిర్ణయించారు.

ఆక్వారంగంలో సందిగ్ధతకు తెర

  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వా ఫార్మర్స్‌ అసోసియేషన్‌, స్రీంప్‌ హేచరీస్‌ అసోసియేషన్‌ మధ్య చర్చలు

  • పలు కీలక అంశాలపై తీర్మానం

కాకినాడ, సెప్టెంబరు24(ఆంధ్రజ్యోతి): ఆక్వారంగంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వా ఫార్మర్స్‌ అసోసియేషన్‌.. స్రీంప్‌ హేచరీస్‌ అసోసియేషన్‌ మధ్య గురువారం కాకినాడలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా పలు అంశాలపై తీర్మానాలు చేశారు. సీడ్‌ క్వాలిటీ శాస్త్రీయ పద్ధతిలో నాణ్యత పెంచి సరఫరా చేయాలని నిర్ణయించారు. ‘లక్ష సీడ్‌కి ఇరవై వేల సీడ్‌ బోనస్(శాతం), వచ్చిన ప్రతి ప్యాకెట్‌లో ఉన్న కౌంట్‌లో నుంచి పది శాతం డిస్కౌంట్‌ ఇవ్వాలి. తప్పనిసరిగా పోస్టు లార్వా స్టేజ్‌ 10పైన అమ్మకం జరపాలి. ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా హేచరీకి వచ్చి స్వయంగా సీడ్‌ నాణ్యతను పరీక్షించి సీడ్‌ పట్టుకుని వెళ్లాలి. హేచరీ అసోసియేషన్‌, ఫార్మర్‌ అసోసియేషన్‌ ప్రతి నాలుగు నెలలకోసారి కచ్చితంగా సమావేశం కావాలి. ప్రస్తుత రొయ్యల వ్యాధుల తీవ్రత దృష్ట్యా ఏరియాలు ఎంపిక చేసుకుని క్రాప్‌ గ్యాప్‌ కోసం ఏప్రిల్‌ 15 నుంచి మే 30 వరకు అంటే 45 రోజులు ఆరుదల చేసుకోవాలి’ అని సమావేశంలో తీర్మానించారు.

సీడ్‌ కొనుగోలులో మధ్యవర్తుల ప్రమేయం ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా దిశానిర్దేశం చేసుకోవాలి? అనే అంశాలపై వచ్చే సమావేశంలో చర్చిద్దామని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ స్రీంప్‌ హేచరీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఉపాధ్యక్షుడు, బాపట్ల ఎమ్మెల్యే వి.నరేంద్రవర్మ, వైఎస్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, సెక్రటరీ ఎస్‌.సూర్యనారాయణరెడ్డి, ఏపీ స్టేట్‌ ఆక్వా ఫార్మర్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు కనుమూరి భాస్కరరాజు, అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు, ఉపాధ్యక్షుడు ఈదర యశ్వంత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

బజార్‌లో పోస్టుల అమ్మకం

పీజీ కోర్సుల్లో చేరేవారేరి?

Updated Date - Sep 25 , 2026 | 05:09 AM