రూ.657 కోట్లతోపౌల్ట్రీ పాలసీ
ABN , Publish Date - Sep 13 , 2026 | 03:46 AM
రాష్ట్రంలో పౌల్ర్టీ రంగాన్ని మరింత బలోపేతం చేసి, కోళ్ల పెంపకందారులకు అండగా నిలిచేలా ఏపీ పౌల్ట్రీ డెవల్‌పమెంట్ పాలసీ 2026-29ని ప్రభుత్వం ఆమోదించిందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. పాలసీని త్వరితగతిన అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆధునిక కోళ్ల ఫారాలకు భారీ ప్రోత్సాహకాలు
కొత్త షెడ్లకు క్యాపిటల్ రుణాలపై వడ్డీ రాయితీ
పౌల్ట్రీ రైతులపై విద్యుత్ చార్జీల భారం తగ్గింపు
డ్వాక్రాలతో ఏటా 2,720 మదర్ పౌల్ట్రీ యూనిట్లు
దాణా ధరల నియంత్రణపై కేంద్రంతో చర్చలు: మంత్రి అచ్చెన్న
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పౌల్ర్టీ రంగాన్ని మరింత బలోపేతం చేసి, కోళ్ల పెంపకందారులకు అండగా నిలిచేలా ఏపీ పౌల్ట్రీ డెవల్‌పమెంట్ పాలసీ 2026-29ని ప్రభుత్వం ఆమోదించిందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. పాలసీని త్వరితగతిన అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. శనివారం విజయవాడలో మంత్రిని పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు కలసి, పౌల్ట్రీ పాలసీని ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడా రు. ‘రాష్ట్రంలో పౌల్ట్రీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.657 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. పీపీపీ విధానం లో చిత్తూరు, విజయవాడ, విశాఖ కేంద్రాలుగా ఎగ్, చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో పౌల్ట్రీ షెడ్ల నిర్మాణానికి బెటర్‌మెంట్ చార్జీల మినహాయిం పు ఇవ్వనున్నాం. పౌల్ట్రీ రంగం ఎదుర్కొనే ప్రధాన సమస్య దాణా వ్యయం.. దాని తగ్గింపుపై కేంద్రంతో చర్చించి, నూక బియ్యాన్ని పౌల్ర్టీ ఫారాలకు అందించేలా చర్యలు చేపడతాం. కోళ్ల ఫారాలు, హేచరీల మౌలిక వసతుల అభివృద్ధికి తీసుకునే రుణాలపై 4 శాతం వడ్డీ రాయితీ కల్పి స్తాం. ఇందుకోసం మూడేళ్లకు రూ.72 కోట్లు కేటాయిం చాం.
పౌల్ట్రీ రైతులకు విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు లో టెన్షన్ కోళ్ల ఫారాలకు యూనిట్ రూ.3.75, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లకు యూనిట్ రూ.4.75 చొప్పున టారీ్‌ఫను క్రమబద్ధీకరించాం. కొత్తగా ఏర్పాటు చేసే ఎన్విరాన్‌మెంటల్ కంట్రో ల్డ్ పౌల్ర్టీ షెడ్లకు మౌలిక వసతుల కల్పనపై 25 శాతం వరకు, గరిష్ఠంగా రూ.25 లక్షల వరకు క్యాపిటల్ సబ్సిడీ అందించనున్నాం. ఇప్పటికే ఉన్న పౌల్ర్టీ షెడ్లను ఆధునికీకరించేందుకు కూడా 25 శాతం వరకు, గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు సబ్సిడీకి ప్రతిపాదనలు చేశాం. అర్హత కలిగి న ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్డ్ పౌల్ట్రీ షెడ్లకు టర్మ్ లోన్లపై వడ్డీ రాయితీతోపాటు విద్యుత్ చార్జీలపై యూనిట్‌కు రూ.2, ఏడాదికి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు మూడేళ్ల పాటు విద్యుత్ టారీఫ్ సబ్సిడీ వర్తిస్తుంది.’ అని మంత్రి అచ్చెన్న తెలిపారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద జగన్ చెప్పుకుంది కొండంత అంటూ విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి