మైక్రో ఇరిగేషన్‌లో దేశంలోనే ఏపీ నంబర్ వన్: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 06 , 2026 | 01:07 PM
రాష్ట్ర భవిష్యత్తు, వ్యవసాయ సుస్థిరత కేవలం నీటి సంరక్షణతోనే సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. యాడికిలో సాగునీటి సంఘాలు, రైతులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు..
అమరావతి, ఏప్రిల్ 6: రాష్ట్ర భవిష్యత్తు, వ్యవసాయ సుస్థిరత కేవలం నీటి సంరక్షణతోనే సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ‘పరిగెత్తే నీటిని నడిపించాలి.. నడిచే నీటిని నిలపాలి.. నిలిచిన నీటిని భూమిలోకి పంపాలి’ అనే నినాదంతో భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. యాడికిలో సాగునీటి సంఘాలు, రైతులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రకృతి ఇచ్చిన వనరులను కాపాడుకుంటూ, భూమినే ఒక భారీ జలాశయంగా మార్చుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. గతంలో టీడీపీ హయాంలో చేపట్టిన నీరు-ప్రగతి, ఎన్టీఆర్ జలసిరి వంటి వినూత్న పథకాల వల్ల నేడు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ (సూక్ష్మ సాగు) రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వర్షపు నీటి విలువ తెలిసిన రాయలసీమ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మైక్రో ఇరిగేషన్ ఒక వరంగా మారింది. మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ తెచ్చాం.. రాయితీతో పరికరాలు ఇచ్చాం. 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తున్నాం. రాయలసీమలో 63 శాతం పంటలకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. హార్టికల్చర్‌కు వచ్చే ఆరేళ్లలో రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తాం. అనంతపురంలో భూగర్భ జలాలను 11.25 మీటర్లకు తీసుకొచ్చాం. రాయలసీమలో 20వేల చెరువులు నింపాం. భూమినే ఒక జలాశయంగా మార్చుకోవాలి. నీటి బొట్టు విలువను గ్రహించి సంరక్షించుకుంటేనే రాబోయే తరాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది’ అని అన్నారు.
ఏపీకి ఒకే ఒక్క రాజధాని అమరావతి..
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం రాజధాని పేరుతో మూడుముక్కలాట ఆడారు. అమరావతి ప్రజా రాజధాని.. పురాణాల్లో దేవతల రాజధాని. దేశం అంతా మనతో నిలబడ్డారు.. ఒక్క వైసీపీ తప్ప. వెలిగొండను ఈ ఏడాది పూర్తిచేస్తాం. వెలిగొండ ద్వారా ఈ ఏడాదే నీళ్లు వదులుతాం. అనంతపురం జిల్లాలో వాగులు, చెరువులను అనుసంధానం చేసే బాధ్యత కలెక్టర్‌దే. ఇప్పుడు అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేశాం. కృష్ణా నది నుంచి గతేడాది 1,500 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. వృథాగా పోయే నీటిలో 300 టీఎంసీలు మళ్లిస్తే సమస్య ఉండదు. నదుల అనుసంధానం జరిగే దేశంలో సంపదకు కొరత ఉండదు. పట్టిసీమతో నీళ్లు లిఫ్ట్ చేసి కృష్ణా డెల్టాకు మల్లిస్తాం. కరువు జిల్లాగా ఉన్న అనంతపురాన్ని సంపన్న జిల్లాగా మారుస్తాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి...
విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం: పీవీఎన్ మాధవ్
బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
Read Latest AP News And Telugu News