జగన్ హయాంలోనే ‘ఏకగ్రీవ’ అరాచకం
ABN , Publish Date - Oct 23 , 2026 | 04:18 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నాడు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా..
2014లో పట్టణ స్థానికంలో ఒక శాతమే ఏకగ్రీవాలు
2021లో వైసీపీ హయాంలో ఏకంగా 20.72 శాతం
24శాతం ఎంపీటీసీ, 19శాతం జెడ్పీటీసీ స్థానాలు సైతం
నాడు అరాచకాలు చేసి వైసీపీ నేతల ఎన్నిక
నేడు గగ్గోలు పెడుతూ డ్రామాలు
అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నాడు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అడ్డగోలుగా ఏకగ్రీవాలు చేశారు. ఇప్పుడు నామినేషన్లు వేయనివ్వడం లేదంటూ వైసీపీ డ్రామాలు ఆడటంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలపై వైసీపీ గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల గణాంకాలపై విశ్లేషణ చేస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అడ్డగోలు వ్యవహారాలతో ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేయించుకున్నారని టీడీపీ శ్రేణులు గణాంకాలతో సహా వివరిస్తున్నాయి.
2021లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడి 20.72 శాతం ఏకగ్రీవాలు చేయించుకున్న ఘనత వైసీపీదేనని అంటున్నాయి. అలాగే గ్రామీణ స్థానిక సంస్థల్లో 24 శాతం మేర ఎంపీటీసీ స్థానాలు, 19 శాతం మేర జెడ్పీటీసీ స్థానాలను బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అంతకుముందు 2014లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికలతో పోల్చుకుంటే 2021 స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాల శాతం అమాంతం పెరిగిపోయిందని, దీనికి గొడ్డలి పార్టీ అరాచకాలే కారణమని విశ్లేషిస్తున్నాయి. 2014లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల్లో 1 శాతం స్థానాల్లో మాత్రమే ఏకగ్రీవాలు జరిగాయని, గ్రామీణ స్థానిక సంస్థల్లో 2 శాతం మేర ఎంపీటీసీ స్థానాలు, 0.09 శాతం మేర జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని టీడీపీ శ్రేణులు వివరిస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి: