ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Oct 23 , 2026 | 04:40 AM
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూలును ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. మండలి కార్యదర్శి పి.రంజిత్ బాషా గురువారం పరీక్షల తేదీలను విడుదల చేశారు. ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. గతేడాది 24 రోజుల పాటు ఇంటర్ పరీక్షలు జరిగాయి.
ఎలక్టివ్ సబ్జెక్టులకు ప్రత్యేక ప్రశ్నపత్రం
16 రోజులకు తగ్గిన పరీక్షల షెడ్యూలు
ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్
అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూలును ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. మండలి కార్యదర్శి పి.రంజిత్ బాషా గురువారం పరీక్షల తేదీలను విడుదల చేశారు. ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. గతేడాది 24 రోజుల పాటు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ప్రశ్నాపత్రాల్లో పలు మార్పులు చేసి దానిని 16 రోజులకు తగ్గించారు. ఈ ఏడాది నుంచి రెగ్యులర్ సబ్జెక్టులకు, ఎలక్టివ్ సబ్జెక్టులకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు మొదటిరోజే ఎలక్టివ్ సబ్జెక్టుల పరీక్షలు జరుగుతాయి.
ఎనిమిది భాషా సబ్జెక్టులు, గణితం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ర్టీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ సబ్జెక్టులను ఎలక్టివ్‌గా ఎంచుకున్న విద్యార్థులు మొదటిరోజు పరీక్ష రాస్తారు. రెండో సంవత్సరం విద్యార్థులకు రెండో రోజు ఎలక్టివ్ సబ్జెక్టుల పరీక్ష జరుగుతుంది. గతంలో ఫెయిల్ అయి తిరిగి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు పాత విధానం వర్తిస్తుంది. రెగ్యులర్ సబ్జెక్టులకు, అదనపు సబ్జెక్టులకు ఒకే ప్రశ్నాపత్రం ఉంటుంది. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఉంటాయి.
ఈ వార్తలనూ చదవండి: