Share News

27 వేల మంది చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:29 AM

‘రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం’ (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గత మూడు నెలల్లో 27.54 లక్షల మంది చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

27 వేల మంది చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు

  • ఆర్‌బీఎస్‌కే కింద 27.54 లక్షల మందికి స్క్రీనింగ్..

  • వైద్య శాఖ కార్యదర్శి వీరపాండియన్‌

అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం’ (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గత మూడు నెలల్లో 27.54 లక్షల మంది చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని, వారిలో 27,039 మందిలో ఆరోగ్య సమస్యలు గుర్తించామని ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండియన్‌ తెలిపారు. పిల్లల్లో ఆరోగ్య సమస్యలను గుర్తించి, ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఆర్‌బీఎస్‌కే అమలు తీరుపై ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్‌, కమిషనర్‌ చక్రధర్‌బాబు గురువారం ఏపీఐఐసీలో సమీక్ష నిర్వహించారు. చిన్నారులకు డిసెంబరు నాటికల్లా స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు.

వైద్య పరీక్షలు నిర్వహించిన చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు గుర్తించిన 27,039 మందికి తదుపరి చికిత్స కోసం బోధనాస్పత్రులకు పంపించామన్నారు. 541 మందికి పలురకాల శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షల్లో భాగంగా చాలామంది చిన్నారులు విటమిన్‌ లోపాలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. 3,673 మంది విటమిన్‌-ఎ, 1,847 మందికి విటమిన్‌-డి లోపంతో బాధపడుతున్నారని తెలిపారు. 5,320 మందికి గుండె జబ్బులు, 1,494 మందికి శ్వాస సంబంధ సమస్యలు, 1,037 మందికి మూర్చ సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 05:29 AM