Share News

కొవిడ్‌పై ఏపీ సర్కార్ అప్రమత్తం.. ప్రభుత్వాసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు

ABN , Publish Date - Jul 21 , 2026 | 06:58 PM

కొవిడ్‌పై ఏపీ సర్కార్ అప్రమత్తంగా ఉందని.. ప్రభుత్వాసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.

కొవిడ్‌పై ఏపీ సర్కార్ అప్రమత్తం.. ప్రభుత్వాసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు
Andhra Pradesh COVID News

అమరావతి, జులై 21: కొవిడ్‌పై ఏపీ సర్కార్ అప్రమత్తంగా ఉందని.. ప్రభుత్వాసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాయత్తమైందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స, పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశామని వెల్లడించారు. కొవిడ్‌పై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వల్ప లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, అనుమానితులకు వెంటనే పరీక్షలు చేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.


రాష్ట్రంలోని 17 ఆసుపత్రుల్లో 255 ప్రత్యేక కొవిడ్ పడకలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. లక్షల సంఖ్యలో మాస్కులు, ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు, చికిత్సకు అవసరమైన మందుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. టెస్టింగ్ కిట్లు, రెమిడిసివిర్‌ను స్థానికంగానే కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు అత్యవసర కొనుగోళ్లకు ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు అధికారాలు కల్పించినట్లు తెలిపారు. ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా ఆర్టీపీసీఆర్, ఆర్‌ఎన్‌ఏ కిట్ల సరఫరా కొనసాగుతుండగా, ప్రతి ఆసుపత్రికీ 50 రెమిడిసివిర్ ఇంజెక్షన్లు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామని, మరో ఒకటి, రెండు రోజుల్లో మిగిలిన కొవిడ్ సామగ్రి కూడా ఆసుపత్రులకు చేరుతుందని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

భూకబ్జాలో సూత్రధారి సీతారాం.. పాత్రధారి ఆయన కుమారుడు: ఎమ్మెల్యే కూన రవికుమార్

ఏపీకి మరో అంతర్జాతీయ పెట్టుబడి.. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 21 , 2026 | 08:31 PM