Share News

పోస్టల్‌ బ్యాలెట్‌పై ‘గుర్తు’లు ఉండొద్దు!

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:04 AM

మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మేయర్‌/చైర్‌పర్సన్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల ముద్రణపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది.

పోస్టల్‌ బ్యాలెట్‌పై ‘గుర్తు’లు ఉండొద్దు!

  • అభ్యర్థులు, పార్టీల పేర్లు తెలుగు, ఇంగ్లీష్‌లో ఉండాలి

  • పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల ముద్రణపై ఈసీ స్పష్టత

అమరావతి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మేయర్‌/చైర్‌పర్సన్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల ముద్రణపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. అభ్యర్థుల పేర్ల ముద్రణ, రాజకీయ పార్టీల అనుబంధ వివరాల నమోదుకు సంబంధించి గతంలో జారీచేసిన సూచనలను పాక్షికంగా సవరిస్తూ ఆదివారం సర్క్యులర్‌ జారీచేసింది.

పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రంలో ప్రతి అభ్యర్థి పేరు మొదట తెలుగులో, దాని కింద ఇంగ్లిషులో ఉండాలని ఆదేశించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టర్డ్‌ పార్టీలు, ఇతర అభ్యర్థులుగా వర్గీకరించి పేర్లను ముద్రించాలని, రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్ల కింద పార్టీ అనుబంధ వివరాలను కూడా తెలుగు, ఇంగ్లిషు భాషల్లో నమోదు చేయాలని పేర్కొంది. పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలపై ఎలాంటి ఎన్నికల గుర్తులను ముద్రించకూడదని ఎన్నికల సంఘం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అభ్యర్థుల పేర్ల అమరిక సాధారణ బ్యాలెట్‌ పత్రాల్లో ఉండే క్రమంలోనే ఉండాలని పేర్కొంది. ఈ సవరించిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల అధికారులను ఆదేశించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 06:04 AM