పిచ్చికుక్క దాడిలో 40 మందికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Jul 04 , 2026 | 08:07 PM
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఓ పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. దారిన వెళ్లిన వారిపై దాడి చేయడంతో సుమారు 40 మంది గాయపడ్డారు.
అనంతపురం: రాయదుర్గం పట్టణంలో ఓ పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. శాంతినగర్‌తో పాటు బళ్లారి రోడ్డు, ఓబులాచారి రోడ్డు పరిసర ప్రాంతాల్లో స్వైరవిహారం చేసిన పిచ్చికుక్క దారిన వెళ్లిన వారిపై విచక్షణారహితంగా దాడి చేసింది.
ఈ ఘటనలో సుమారు 40 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కుక్క దాడి చేయడంతో ప్రజలు భయాందోళనకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. స్థానికులు అప్రమత్తమై గాయపడిన వారిని వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
పిచ్చికుక్క దాడితో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది. చిన్నారులు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన నేపథ్యంలో పిచ్చికుక్కల నివారణలో మున్సిపల్ అధికారుల వైఫల్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
మెల్‌బోర్న్ పర్యటనకు ముందు ప్రధాని మోదీకి డెత్ వార్నింగ్
తాడేపల్లి ప్యాలెస్ నుంచి నెల నెలా ఎంత ముడుతోంది: మంత్రి దుర్గేష్