Share News

అనంతపురం జిల్లాలో దారుణం: కమ్మల కోసం హత్య చేసి.. చెవులు కోసి..

ABN , Publish Date - Oct 05 , 2026 | 09:57 PM

ఆమె చెవికున్న కమ్మలను కొందరు దుండగులు గమనించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రోకలిబండతో దాడి చేశారు.

అనంతపురం జిల్లాలో దారుణం: కమ్మల కోసం హత్య చేసి.. చెవులు కోసి..

అనంతపురం జిల్లా, అక్టోబర్ 5: ఓ వృద్ధురాలి చెవి కమ్మలపై కన్ను వేసిన కొందరు దుండగులు వాటి కోసం దారుణానికి ఒడిగట్టారు. ఆమెను హత్య చేసి, చెవులను కోసి కమ్మలను దొంగలించారు. అనంతపురం జిల్లా కోవూరునగర్‌లో ఈరోజు జరిగిందీ ఘటన. వివరాల్లోకెళితే..


చిన్న నాగమ్మ (80) అనే వృద్ధురాలు కోవూరునగర్‌లో నివాసముంటున్నారు. అయితే ఆమె చెవికున్న కమ్మలను కొందరు దుండగులు గమనించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రోకలిబండతో దాడి చేశారు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. తరువాత నాగమ్మ చెవులు కోసి వారు కమ్మలను తీసుకువెళ్లారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆధారాలను సేకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలూ చదవండి

వైసీపీని వీడి టీడీపీలో చేరిన మైనార్టీ కుటుంబాలు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 05 , 2026 | 09:57 PM