తిమ్మాపురంలో వైసీపీ మూకల అరాచకం
ABN , Publish Date - Nov 29 , 2026 | 02:52 AM
అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ ఎన్నిక వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
కళ్యాణదుర్గం/అనంతపురం కల్చరల్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ ఎన్నిక వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కౌంటింగ్ రోజున టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి రోజాను నిర్బంధించి, ఫలితాన్ని వైసీపీకి అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదంపై ఎంపీడీవో సూర్యనారాయణ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. తిమ్మాపురం గ్రామ పంచాయతీకి తొలి విడతలో 26న ఎన్నిక నిర్వహించారు. కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఆ రోజు అర్ధరాత్రి దాటింది.
ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ అల్లరిమూకలు దౌర్జన్యానికి దిగారు. దీంతో సర్పంచి అభ్యర్థి రోజా కౌంటింగ్ కేంద్రంలోనే భోరున విలపించారు. 14 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించడంతో రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసినా అధికారులు అంగీకరించలేదని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని, కేంద్రంలో తమను బెదిరించినవారిపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై ఎంపీడీవో సూర్యనారాయణ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. కాగా, ఎనుములదొడ్డి, ఎరడికెర, తిమ్మాపురం, తూముకుంట పంచాయతీల్లో రీకౌంటింగ్ జరిపించాలని కలెక్టర్ ఆనంద్‌కు టీడీపీ నాయకులు విన్నవించారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..