అమరావతి గెలిచింది.. బీజేపీ చీఫ్ నితిన్ నబిన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు
ABN , Publish Date - Apr 04 , 2026 | 09:37 PM
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అత్యున్నత చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్‌కు శనివారం సీఎం చంద్రబాబు ఫోన్ చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
అమరావతి, ఏప్రిల్4: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అత్యున్నత చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్‌కు శనివారం సీఎం చంద్రబాబు ఫోన్ చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిని రాష్ట్ర ఏకైక, శాశ్వత రాజధానిగా స్థిరపరుస్తూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లు అమోదం పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చూపిన చొరవ వల్లనే అమరావతికి నేడు దేశవ్యాప్తంగా గుర్తింపు, భద్రత లభించాయని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదంతో రాజధాని విషయంలో గతంలో ఉన్న సందిగ్ధతలకు శాశ్వతంగా తెరపడిందని సీఎం స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్ధతు పలికేలా సమన్వయం చేసినందుకు నితిన్ నబిన్‌కు ధన్యవాదాలు. బిల్లు అమోదం కోసం బీజేపీ చీఫ్ చేసిన కృషి అనిర్వచనీయం. అమరావతి విషయంలో ఎన్టీఏ భాగస్వామ్య పార్టీలు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతును ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. కేంద్ర పెద్దల సహకారం, ఎన్టీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. పార్లమెంట్‌లో ఈ చట్టబద్ధతతో అమరావతి అభివృద్ధికి లైన్ క్లీయర్ అవ్వడమే కాకుండా, ఇన్వెస్టర్లలో సైతం రాష్ట్రంపై నమ్మకం రెట్టింపు అవుతుంది.’ అని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు