అమరావతిలో శాంక్టా మారియా
ABN , Publish Date - Aug 30 , 2026 | 04:24 AM
రాజధాని అమరావతిలో సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కానుంది. ఈ సంస్థకు తుళ్లూరులో ఏపీ సీఆర్డీఏ కేటాయించిన 7.97 ఎకరాల భూమికి సంబంధించి శనివారం అగ్రిమెంట్ పూర్తయింది.
తుళ్లూరు, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కానుంది. ఈ సంస్థకు తుళ్లూరులో ఏపీ సీఆర్డీఏ కేటాయించిన 7.97 ఎకరాల భూమికి సంబంధించి శనివారం అగ్రిమెంట్ పూర్తయింది. సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులకు ఏపీ సీఆర్డీఏ ఎస్టేట్స్ విభాగం జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్ అగ్రిమెంట్ పత్రాలను మందడం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. విద్యారంగంలో 45 ఏళ్లుగా సేవలందిస్తున్న సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.120 కోట్ల పెట్టుబడితో అత్యుత్తమ సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిలో పాఠశాల క్యాంప్‌సను అభివృద్ధి చేయనున్నట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు. అమరావతిలో విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి శాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు మరో కీలక ముందడుగుగా నిలవనుందని పేర్కొన్నారు. సుమారు 800 మంది విద్యార్థులకు విద్య, వసతి, క్రీడలు తదితర అన్ని సౌకర్యాలను అమరావతి క్యాంప్‌సలో అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఈ సంస్థ ద్వారా సుమారు 200 మందికి ప్రత్యక్షంగా, మరో 100 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని స్పష్టం చేశారు.
Also Read:
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు