ఆసేతు హిమాచలం అమరావతి పేరు
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:42 AM
‘ఆసేతు హిమాచలం అమరావతి పేరు వినిపిస్తుందంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది’ అని మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. తన పోస్టుకు... చిన్న ప్రపంచం, బలమైన అనుబంధాలు అన్న ట్యాగ్‌లైన్‌ను జోడించారు. సుధీర్‌కుమార్ అనే బైకర్‌కి సంబంధించిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ట్రెండైంది.
బైకర్ సుధీర్ వీడియోపై లోకేశ్ స్పందన
‘ఆసేతు హిమాచలం అమరావతి పేరు వినిపిస్తుందంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది’ అని మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. తన పోస్టుకు... చిన్న ప్రపంచం, బలమైన అనుబంధాలు అన్న ట్యాగ్‌లైన్‌ను జోడించారు. సుధీర్‌కుమార్ అనే బైకర్‌కి సంబంధించిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ట్రెండైంది. ఈ వీడియోను తన పోస్టుకు లోకేశ్ ట్యాగ్ చేశారు. సుధీర్‌కుమార్ లడఖ్ ప్రాంతంలో టుర్‌టుక్ నుంచి నుబ్రా వెళ్లే దారిలో తనకు ఎదురైన అనుభవాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో ఏముందంటే.. సుధీర్ బైక్ వెళుతుండగా దాన్ని ఆపిన చిన్నారులు మొహరం సందర్భంగా షర్బత్ ఇచ్చి తాగాలని కోరారు. ఆ చిన్నారుల తల్లి సుధీర్‌ను మీది ఏ ఊరు అని ప్రశ్నించగా... సుధీర్ ఆంధ్రప్రదేశ్ అని సమాధానమిచ్చారు. దీనిపై చిన్నారులు స్పందిస్తూ అమరావతి.. అని అనడంతో వీడియో ముగుస్తుంది.
ఈ వార్తలనూ చదవండి...
స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:
ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..