Share News

అమరావతి భూసమీకరణ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్..

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:15 PM

అమరావతి భూసమీకరణ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎకరం కంటే తక్కువ భూమిని ఇచ్చిన ఎల్‌పీఎస్ రైతులకు కూడా యాన్యుటీ చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. వివరాల్లోకి వెళితే..

అమరావతి భూసమీకరణ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్..
Amaravati LPS Farmers

అమరావతి, సెప్టెంబర్ 25: ఏపీలో ప్రాజెక్టుల కోసం భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎకరం కంటే తక్కువ భూమి ఇచ్చిన ఎల్‌పీఎస్ రైతులకు యాన్యుటీ చెల్లింపులు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం 1,304 మంది అర్హులైన భూసమీకరణ రైతులకు మొత్తం రూ.5.04 కోట్ల మేర యాన్యుటీ చెల్లింపులను ప్రభుత్వం ధ్రువీకరించింది. డ్రైల్యాండ్ భూములకు ఏడాదికి రూ.40 వేల చొప్పున, జరీబు భూములకు ఏడాదికి రూ.60 వేల చొప్పున యాన్యుటీ చెల్లించనున్నారు. ఎకరం లోపు భూమిని ఇచ్చిన రైతులకు కూడా ఎకరం భూమికి వర్తించే విధంగా 10 సంవత్సరాల పాటు యాన్యుటీ ప్రయోజనం అందనుంది.


2025 డిసెంబర్ 2 నాటికి భూ యాజమాన్యం నిర్ధారణ పొందిన అర్హులైన రైతులకే ఈ నిర్ణయం వర్తించనుంది. అమరావతి పరిధిలోని ఏడు నోటిఫైడ్ గ్రామాలకు చెందిన ఎల్‌పీఎస్ రైతులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. యాన్యుటీ చెల్లింపులకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశించింది. దీంతో ఎకరం కంటే తక్కువ భూమిని భూసమీకరణకు ఇచ్చిన అర్హులైన రైతులకు కూడా యాన్యుటీ ప్రయోజనం అందే అవకాశం ఏర్పడింది.


ఇవి కూడా చదవండి...

దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో విరిగిపడిన కొండచరియలు.. తప్పిన ప్రమాదం

పారిశ్రామికవేత్తలతో లోకేశ్ వరుస భేటీలు.. ఏపీలో ప్రాజెక్టులు పెట్టాలని ఆహ్వానం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 07:53 PM