అమరావతి రైతుల పేరుతో వైసీపీ మరో కొత్త డ్రామా ఆడుతోంది: మంత్రి అచ్చెన్న
ABN , Publish Date - Jun 27 , 2026 | 09:20 PM
అమరావతి రైతుల పేరుతో వైసీపీ కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతుల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం వైసీపీకి అలవాటుగా మారిందని ఆరోపించారు.
అమరావతి, జూన్ 27: అమరావతి రైతుల పేరుతో వైసీపీ మరోసారి రాజకీయ డ్రామాకు తెరలేపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతుల మనోభావాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసీపీకి అలవాటేనని ఆరోపించారు. అమరావతిని నిర్వీర్యం చేసిన వారే ఇప్పుడు రైతుల పరిరక్షణ పేరుతో మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. అమరావతి రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధిలేని వైసీపీ నేతలు.. ప్రజలను రెచ్చగొట్టి, ఆ తర్వాత బాధితులమని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం వైసీపీ రాజకీయ శైలిగా మారిందని ఆయన అన్నారు
రాజధాని అభివృద్ధిని అడ్డుకున్న పార్టీ ఇప్పుడు అదే ప్రాంతంలో రైతుల పక్షాన నిలుస్తున్నట్లు నటించడం ప్రజలను మోసం చేయడమేనని మంత్రి వ్యాఖ్యానించారు. అమరావతిని నిర్వీర్యం చేసిన వారే రైతుల పరిరక్షణ గురించి మాట్లాడటం పూర్తిగా ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఘటనల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులపై దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని అచ్చెన్న ఖండించారు. చట్టాన్ని అమలు చేసే పోలీసులపై దాడులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలకు చోటు లేదని, అలాంటి రాజకీయాలను ప్రజలు ఇప్పటికే తిరస్కరిస్తున్నారని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీం కోర్టు తీర్పు.. దశాబ్దాల నాటి ఆస్తి తగాదాకు ఫుల్ స్టాప్
కేతన్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..