విశాఖలో వెయ్యి పడకలతో ఏఐజీ ఆస్పత్రి
ABN , Publish Date - Sep 01 , 2026 | 05:59 AM
ఏఐజీ (ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) ఏపీలోని విశాఖపట్నంలో రూ.2 వేల కోట్లతో వెయ్యి పడకల సామర్థ్యంతో పూర్తిస్థాయి హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ నిర్మిస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు.
2 వేల కోట్లతో నిర్మాణం.. శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్
విశాఖను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: డాక్టర్ నాగేశ్వరరెడ్డి
విశాఖపట్నం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఏఐజీ (ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) ఏపీలోని విశాఖపట్నంలో రూ.2 వేల కోట్లతో వెయ్యి పడకల సామర్థ్యంతో పూర్తిస్థాయి హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ నిర్మిస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు. సుమారు వెయ్యి మంది డాక్టర్లు వైద్య సేవలు అందిస్తారని, 9 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. సోమవారం ఆయన విశాఖలోని ఎండాడ ప్రాంతంలో ఏఐజీ హాస్పిటల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు చిరునామా ఏఐజీ హాస్పిటల్స్ అని, నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోందని కొనియాడారు. ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని చెప్పారు. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ విశాఖను ఒక మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రస్తుతం వైద్య సేవల కోసం ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్తున్నారని, ఇకపై విశాఖలోనే అన్ని చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు.
ఈ వార్తలను కూడా చదవండి
2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..
పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..