Share News

సినిమా హిట్ అయితే కొమ్ములు వచ్చినట్టు ఎగరకూడదు: హీరో సుమన్

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:19 PM

‘సినిమా హిట్ అయినంత మాత్రాన కొమ్ములు వచ్చినట్టు ఎగరకూడదు.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెదలాలి’ అని ప్రముఖ సినీ నటుడు సుమన్ హితవు పలికారు.

సినిమా హిట్ అయితే కొమ్ములు వచ్చినట్టు ఎగరకూడదు: హీరో సుమన్
actor suman comments on young heros

నెల్లూరు, సెప్టెంబర్ 24: ‘సినిమా హిట్ అయిందని కొమ్ములు వచ్చినట్టు ఎగరకూడదు.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెదలాలి’ అని ప్రముఖ సినీ నటుడు సుమన్ హాట్ కామెంట్స్ చేశారు. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో ఓ ప్రైవేటు ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొత్తగా పనిచేస్తున్న కొంతమంది నటీనటులకు క్రమశిక్షణ తక్కువగా ఉంది. షూటింగ్‌లకు లేటుగా వస్తున్నారు. ఎవరినీ కేర్ చేయడం లేదు. సెట్లలో అన్ని విషయాల్లో వేలు పెడుతున్నారు. అవి మార్చమని.. ఇవి మార్చమని సలహాలు ఇస్తున్నారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు మనం సహకరిస్తేనే.. సినిమా ఫ్లాప్ అయినా అవకాశాలు ఉంటాయి. ఈ రోజుల్లో ఒక్కసారి మార్కెట్ పోతే ఎవరైనా సరే.. అవుట్ అవ్వాల్సిందే. సినిమా హిట్ అయిందని కొమ్ములు వచ్చినట్టు ఎగరకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి’ అని సుమన్ హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి

బిహార్‌లో దారుణం.. మరో బాలికపై లైంగిక వేధింపులు..

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు..

Updated Date - Sep 24 , 2026 | 07:44 PM