-
-
Home » Andhra Pradesh » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 21st November 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 21 , 2026 | 07:47 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 21, 2026 09:15 IST
NTR జిల్లా: తిరువూరు అడవుల్లో పులి సంచారం
అధికారులకు సవాలుగా మారిన పులి కదలికలు
ఏ.కొండూరు మండలం పుడమిగట్టు నుంచి..
తిరువూరు మండలంలోకి చేరిన పులి
చిక్కుళ్లగూడెం-జి.కొత్తూరు అడవుల్లో పులి సంచారం
తెలంగాణ సరిహద్దు వరకూ వెళ్లి..
వెనక్కి వచ్చినట్లు గుర్తించిన అధికారులు
-
Nov 21, 2026 08:58 IST
సిరాజ్ ఎంపిక వివాదంపై స్పందించిన కపిల్ దేవ్
సెలక్టర్లు వారి బాధ్యత గొప్పగా చేస్తున్నారన్న కపిల్
మన ఇష్టాలు ముఖ్యం కాదు.. జట్టు వ్యూహం ప్రధానం: కపిల్
-
Nov 21, 2026 08:47 IST
మణిపూర్: చందేల్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి
మరో 180 మందికి పైగా అస్వస్థత
బాధితులను పరామర్శించిన సీఎం ఖేమ్‌చంద్ సింగ్
మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
ఇంఫాల్.. మణిపూర్‌లో కల్తీ మద్యం కలకలం
-
Nov 21, 2026 08:23 IST
హైదరాబాద్: నేడు డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా మెగా సదస్సు
పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్
2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా సదస్సు
ఈనెల 25 నుంచి 27 వరకు కిషన్‌రెడ్డి పాదయాత్ర
హైదరాబాద్ వాక్స్-నషా ముక్త్ భారత్ పేరుతో యాత్ర
అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు పాదయాత్ర
-
Nov 21, 2026 08:14 IST
ఒంగోలు: పెళ్లూరు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
ఉదయం గం.06:10 సమయంలో ఘటన
కల్వర్టు గోడను ఢీకొట్టి కాల్వలోకి బోల్తా కొట్టిన మారుతి ఎర్టిగా కారు
కారులో ప్రయాణిస్తున్న నలుగురి మృతి
మృతులు బాపట్లకు చెందిన డ్రైవర్ ప్రవీణ్..
వెంకట్రావు, సుజాత, సీతా మహాలక్ష్మి.
కొత్తగా వివాహమైన జంట శ్రీతేజ, కైవల్యలకు స్వల్ప గాయాలు..
108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలింపు
-
Nov 21, 2026 07:58 IST
IND VS NZ: రెండో వికెట్ కోల్పోయిన భారత్
295 పరుగుల వద్ద ఔటైన దేవదత్ పడిక్కల్(80)
-
Nov 21, 2026 07:57 IST
స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు..
తెలంగాణ, ఏపీలోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు
హైదరాబాద్, విజయవాడ సహా పలు చోట్ల సంస్థ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు
హైదరాబాద్ కొండాపూర్ కేంద్రంగా పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్నేహ గ్రూప్
డైరెక్టర్లు రామ్ రెడ్డి డెండి, వరుణ్ రెడ్డి డెండి, స్నేహ డెండి నివాసాల్లో రైడ్స్
-
Nov 21, 2026 07:36 IST
లిమా: పెరూలో శుక్రవారం రాత్రి భారీ భూకంపం
రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో ప్రకంపనలు
ఆండీస్ పర్వత ప్రాంతంలో భూకంపం
జునిన్‌కు ఉత్తరాన 34 కి.మీ. దూరంలో కేంద్రం
భూమికి 108 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం
-
Nov 21, 2026 07:24 IST
హైదరాబాద్: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం..
వివాహిత లక్ష్మీదేవి (25) ఆత్మహత్య
ఫోన్ చూడవద్దని తల్లి మందలించడంతో మనస్తాపంతో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య
మృతురాలు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం వాసిగా గుర్తింపు
ఇద్దరు పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి గదిలోకి వెళ్లి బలవన్మరణం
-
Nov 21, 2026 07:14 IST
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,25,560
22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,15,090
కిలో వెండి ధర రూ.1,74,900
-
Nov 21, 2026 07:00 IST
IND vs NZ: కేఎల్ రాహుల్ సెంచరీ
207 బంతుల్లో శతకం సాధించిన రాహుల్
70 ఓవర్లకు భారత్ స్కోర్ 255/1