శ్రీశైలం లింగాలగట్టు గంగలో యువకుడి మృతి
ABN , Publish Date - Sep 07 , 2026 | 06:24 AM
శ్రీశైల మండలం సున్నిపెంట లింగాలగట్టు పాతాళగంగలో స్నానానికి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎడమగట్టు తెలంగాణ పవర్‌హౌస్ నుంచి వినియోగించిన నీటి అవుట్‌లెట్ సమీపంలో ఆదివారం మధ్యాహ్న సమయంలో మహారాష్ట్రలోని ముంబయి ప్రాంతానికి చెందిన కుటుంబసభ్యులు గంగ స్నానాలకు దిగారు.
స్నానానికి వెళ్లి మునిగిపోయిన మహారాష్ట్ర యువకుడు
శ్రీశైలం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మండలం సున్నిపెంట లింగాలగట్టు పాతాళగంగలో స్నానానికి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎడమగట్టు తెలంగాణ పవర్‌హౌస్ నుంచి వినియోగించిన నీటి అవుట్‌లెట్ సమీపంలో ఆదివారం మధ్యాహ్న సమయంలో మహారాష్ట్రలోని ముంబయి ప్రాంతానికి చెందిన కుటుంబసభ్యులు గంగ స్నానాలకు దిగారు. విప్రో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సచిన్ రాజ్‌పుత్ (22), ఖాన్‌పూర్ గల్లాహర్ ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్న అభిషేక్ చతుర్వేది (29) ఒడ్డు నుంచి గంగలోకి కొంత దూరం వెళ్లారు. ప్రవాహంతో పాటు, లోతును గమనించలేక వీరు కొట్టుకుపోయారు. భయాందోళనకు గురైన వారిద్దరు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు తెప్ప సహాయంతో ఇద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించారు. స్పృహ కోల్పోయిన వారిద్దరిని ఒడ్డుకు తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించారు. అభిషేక్ చతుర్వేది కోలుకోగా, సచిన్ రాజ్‌పుత్ మృతి చెందినట్టు సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగిన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం అమ్రాబాద్ మండలం ఈగలపెంట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.
ఈ వార్తలను కూడా చదవండి
క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం: శంకర్
వెంకటేశ్వరకాలనీలో కార్డన్‌సెర్చ్