Share News

ఏపీ వాసులు ఏడుగురు గల్లంతు

ABN , Publish Date - Aug 28 , 2026 | 03:21 AM

నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మానస సరోవర్‌ యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకున్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం అన్ని మార్గాల్లో సమన్వయం చేయాలని గురువారం అధికారులను ఆదేశించారు.

ఏపీ వాసులు ఏడుగురు గల్లంతు

  • నేపాల్‌ వరద బీభత్సం తర్వాత దొరకని జాడ

  • ఫోన్లు స్విచ్చాఫ్‌ కావడంతో కుటుంబాల్లో టెన్షన్‌

  • ప్రతికూల వాతావరణంతో కొందరికి అస్వస్థత

  • పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి లోకేశ్‌

  • ఢిల్లీ ఏపీ భవన్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు

  • అందరినీ క్షేమంగా తేవడమే మన ప్రాధాన్యం

  • కేంద్రం, ఎంబసీలతో టచ్‌లో ఉండండి: బాబు

అమరావతి, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మానస సరోవర్‌ యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకున్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం అన్ని మార్గాల్లో సమన్వయం చేయాలని గురువారం అధికారులను ఆదేశించారు. ఆచూకీ తెలియని వారి వివరాలను నిరంతరం ట్రాక్‌ చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వంతో, భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలన్నారు. రహదారి, విమాన మార్గాలతో పాటు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కష్టాల్లో ఉన్న ఏపీ వాసులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడమే ప్రథమ ప్రాధాన్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ తాజా వివరాలను ఎప్పటికప్పుడు తనకు


41 మంది చిక్కుకున్నారు..

మానస సరోవర్‌ యాత్రకు వెళ్లి చిక్కుకుపోయిన ఏపీ యాత్రికుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్‌ వరదల్లో చిక్కుకున్నట్లు ఇప్పటివరకు గుర్తించామని.. వీరిలో 34 మంది సురక్షితంగా ఉన్నారని, మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. రహదారి, విమాన మార్గాలు పునరుద్ధరించాల్సి ఉండడంతో ప్రస్తుతం కొందరు అక్కడే చిక్కుకుపోయారని తెలిపారు. కర్నూలు-ఆదోని ప్రాంతానికి చెందిన నలుగురు టిబెట్‌లో సురక్షితంగా ఉన్నారని, వారితో మాట్లాడామని చెప్పారు. తిరుపతి ప్రాంతానికి చెందిన 28 మంది యాత్రికులు కాట్‌మాండూలో సురక్షితంగా ఉన్నారని, వారిని కూడా ఆర్టీజీఎస్‌ నుంచి సంప్రదించామని తెలిపారు. చిత్తూరు, విజయవాడ, కాకినాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన ఏడుగురు గల్లంతయ్యారని.. వారి ఫోన్లు అందుబాటులో లేవని చెప్పారు. సమాచారాన్ని బాధితుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నామని చెప్పారు. ఢిల్లీ ఏపీ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి నిరంతరం సమాచారం సేకరిస్తున్నామని.. కేంద్రంతో పాటు కాట్‌మాండూ, చైనా ఎంబసీలతో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు.

ఈ వార్తలను కూడా చదవండి

ట్రాన్స్‌ఫార్మర్లలో ఆయిల్‌ చోరీ

విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి

Updated Date - Aug 28 , 2026 | 03:21 AM