Share News

పర్యావరణ హితంగా చవితి వేడుకలు

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:46 AM

వినాయక చవితి పర్వదినాన్ని పర్యావరణ హితంగా జరుపుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) చైర్మన్‌ పి కృష్ణయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో సచివాలయ ఉద్యోగులకు 3000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

పర్యావరణ హితంగా చవితి వేడుకలు

  • పీసీబీ చైర్మన్‌ పి కృష్ణయ్య పిలుపు

  • సచివాలయంలో ఉద్యోగులకు 3000 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి పర్వదినాన్ని పర్యావరణ హితంగా జరుపుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) చైర్మన్‌ పి కృష్ణయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో సచివాలయ ఉద్యోగులకు 3000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పర్యావరణ మానవ సమాజ భద్రతా బాధ్యత ఫౌండేషన్‌ విగ్రహాలను అందించింది. కార్యక్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పికృష్ణయ్య పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సహజ సిద్ధమైన మట్టి, పిండి తదితర పదార్థాలతో వినాయక విగ్రహాలను తయారు చేసి పూజించాలి. నిమజ్జనం వల్ల నీటి వనరులు కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ చూడాలి. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. పండుగల సందర్భంగా సంప్రదాయాలను గౌరవిస్తూనే ప్రజలంతా పర్యావరణాన్ని కాపాడాలి. కాలుష్యాన్ని తగ్గించేందుకు పరిశ్రమలతోపాటు ప్రజలు తమ వంతు సహకారం అందించాలి’ అని కృష్ణయ్య కోరారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్‌, మహిళా వైస్‌ ప్రెసిడెంట్‌ లక్ష్మణకుమారి, పర్యావరణ మానవ సమాజ భద్రతా బాధ్యత ఫౌండేషన్‌ చైర్మన్‌ ఎస్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..

Updated Date - Sep 12 , 2026 | 05:46 AM