Share News

మహిళా ఎస్‌ఐపై దాడి చేసిన వైసీపీ నేతలపై కేసులు నమోదు

ABN , Publish Date - Jul 31 , 2026 | 09:36 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మహిళా ఎస్సైపై పార్టీ నేతలు, కార్యకర్తల వ్యవహారశైలిపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు.

మహిళా ఎస్‌ఐపై దాడి చేసిన వైసీపీ నేతలపై కేసులు నమోదు
Srikakulam News

శ్రీకాకుళం, జులై 31: జిల్లాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై పోలీసులు చర్యలు చేపట్టారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్‌ఐ ప్రవళిక‌పై దాడి జరిగిన ఘటనకు సంబంధించి ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్‌ను ఏ-1గా పేర్కొంటూ.. మొత్తం 21 మందిపై కేసులు నమోదు చేశారు. ఘటన సమయంలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఫిర్యాదు, అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆధారాల మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనలో పాల్గొన్న వారి పాత్రను గుర్తించేందుకు వీడియోలు, సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నట్లు సమాచారం. దర్యాప్తులో లభించే ఆధారాల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మార్కెట్‌లో నకిలీ ఎరువులు విక్రయాలు.. రైతులకు వ్యవసాయ శాఖ బిగ్ అలర్ట్

నకిలీ నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం.. క్రిమినల్ కేసులు నమోదు

Read Latest TG News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 09:46 PM