ఒకేరోజు 150 ఉచిత వైద్య శిబిరాలు
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:08 AM
ఒంగోలు మునిసిపాలిటీ ఆవిర్భవించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలో ఆదివారం ఒక్కరోజే 150 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. 22,139 మందికి వైద్య సేవలందించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఒంగోలులో 22,139 మందికి సేవలు..
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు మునిసిపాలిటీ ఆవిర్భవించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలో ఆదివారం ఒక్కరోజే 150 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. 22,139 మందికి వైద్య సేవలందించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. 119 ప్రైవేటు ఆస్పత్రులు, పలు ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్న 680 మంది వైద్యులు, మూడు వేల మంది సిబ్బంది సహకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల పలు శిబిరాలను సందర్శించి, సేవలను పరిశీలించారు. మిగిలిన ప్రాంతాల్లో అందుతున్న సేవలను టెలీకాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు మునిసిపాలిటీ 150 వసంతాలు జరుపుకోవడం అనందంగా ఉందన్నారు. ఈనెల28,29,30 తేదీలలో నిర్వహించే ఉత్సవాలను అందరూ జయప్రదం చేయాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’