శ్రీశైలానికి పూర్తిగా నిలిచిన ఇన్‌ఫ్లో
ABN , Publish Date - Aug 31 , 2026 | 06:16 AM
శ్రీశైల జలాశయానికి ఇన్‌ఫ్లో పుర్తిగా నిలిచిపోయింది. ఆదివారం జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి అనంతరం 5,075 క్యూసెక్కులు విడుదలైనప్పటికీ సాయంత్రానికి రిజర్వాయర్‌కు చుక్కనీరు చేరలేదు.
నాగార్జునసాగర్‌లోకి 10,941 క్యూసెక్కుల నీరు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
శ్రీశైల జలాశయానికి ఇన్‌ఫ్లో పుర్తిగా నిలిచిపోయింది. ఆదివారం జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి అనంతరం 5,075 క్యూసెక్కులు విడుదలైనప్పటికీ సాయంత్రానికి రిజర్వాయర్‌కు చుక్కనీరు చేరలేదు. కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేయగా, తెలంగాణలోని ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 17,320 క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువకు విడుదల చేశారు. హంద్రీ-నీవా నుంచి 2,372, కల్వకుర్తి నుంచి 2,400, పోతిరెడ్డిపాడు నుంచి 8,000, ఆవిరి రూపంలో మరో 167 క్యూసెక్కులు.. మొత్తంగా 30,259 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 872.10 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా 150.80 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి 10,941 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. సాగర్‌లో నీటిమట్టం 537.50 అడుగులు ఉంది. ఇది 183.15 టీఎంసీలకు సమానం. కుడికాలువ ద్వారా 6660, ఎడమ కాలువ ద్వారా 7029, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2000 .. మొత్తం ఔట్‌ఫ్లో 15,689 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక పులిచింతల ప్రాజెక్టులో 28.07 టీఎంసీల నీరు నిల్వ ఉండగా లీకుల ద్వారా 400 క్యూసెక్కుల నీరు దిగువ కృష్ణకు విడుదలవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి