Share News

Year-Ender 2025 T20I bowlers: ఈ ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్ టీ20 టీమిండియా బౌలర్లు వీరే..

ABN , Publish Date - Dec 22 , 2025 | 09:08 PM

టీమిండియా టీ20 జైత్రయాత్ర వెనుక బ్యాటర్ల కృషి ఎంత ఉందో, బౌలర్ల శ్రమ కూడా అంతే ఉంది. వివిధ దేశాలలో, వివిధ పరిస్థితుల్లో టీమిండియా బౌలర్లు నిలకడగా రాణించారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై పైచేయి సాధించారు.

Year-Ender 2025 T20I bowlers: ఈ ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్ టీ20 టీమిండియా బౌలర్లు వీరే..
Indian cricket year review

ఈ ఏడాది అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. మిగతా ఫార్మాట్లలో మిశ్రమ ఫలితాలు సాధించినా పొట్టి ఫార్మాట్‌లో మాత్రం తిరుగులేని శక్తిగా ఎదిగింది (most wickets for India T20I). సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీ20 జట్టు అత్యంత విజయవంతమైన టీమ్‌గా అవతరించింది. టీ20 ఆసియా కప్‌ను గెలుచుకుంది. అలాగే పలు టీ20 సిరీస్‌లను సాధించింది (Year-Ender 2025 India cricket).


టీమిండియా టీ20 జైత్రయాత్ర వెనుక బ్యాటర్ల కృషి ఎంత ఉందో, బౌలర్ల శ్రమ కూడా అంతే ఉంది. వివిధ దేశాలలో, వివిధ పరిస్థితుల్లో టీమిండియా బౌలర్లు నిలకడగా రాణించారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై పైచేయి సాధించారు. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్లు అమోఘంగా రాణించి అత్యధిక వికెట్లు పడగొట్టారు (India top T20I bowlers).


1) వరుణ్ చక్రవర్తి: 2025లో భారతదేశం తరపున అత్యధిక అంతర్జాతీయ టీ20 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మిస్టరీ స్పిన్నర్ 20 మ్యాచ్‌లలో 36 వికెట్లు సాధించాడు. వికెట్లు పడగొట్టడం మాత్రమే కాదు.. పొదుపుగా బౌలింగ్ చేయడంలో కూడా మేటిగా నిలిచాడు. వరుణ్ 13.19 బౌలింగ్ సగటుతో, ఓవర్‌కు కేవలం 7.08 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

varun2.jpg


2) కుల్దీప్ యాదవ్: వరుణ్ చక్రవర్తి తర్వాత కుల్దీప్ యాదవ్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది 10 టీ20 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ 21 వికెట్లు పడగొట్టాడు. భాగస్వామ్యాలను బ్రేక్ చేయడంలో, మిడిల్ ఓవర్లను నియంత్రించడంలో కుల్దీప్ నైపుణ్యం అనేక మ్యాచ్‌లలో విజయాలకు కారణమైంది.

keldeep.jpg


3) అక్షర్ పటేల్: బ్యాటింగ్‌‌తో పాటు బంతితో కూడా రాణించిన అక్షర్ పటేల్ జట్టులో ఉండడం టీమిండియాకు ఎంతగానో కలిసొచ్చింది. 2025లో 19 టీ20లు ఆడిన అక్షర్ 17 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా పరుగులను నియంత్రించడంలో ఇతర బౌలర్ల కంటే అక్షర్ ముందున్నాడు. కేవలం 6.93 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. అక్షర్ ఆల్‌రౌండ్ ప్రదర్శన టీమిండియాకు ఈ ఏడాది ప్రధాన బలంగా మారింది.

axar.jpg


4) అర్ష్‌దీప్ సింగ్: ఈ ఏడాది అర్ష్‌దీప్ సింగ్ భారత పేస్ అటాక్‌కు నాయకత్వం వహించాడు. ఈ ఏడాది మొత్తం 12 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ సింగ్ 15 వికెట్లు సాధించాడు. ఇతర బౌలర్లతో పోల్చుకుంటే ఎకానమీ రేటు కొంచెం ఎక్కువగా ఉంది. అయితే కొత్త బంతితో, డెత్‌ ఓవర్లలో స్ట్రైక్ చేయగల సామర్థ్యం అర్ష్‌దీప్ సొంతం.

arshdeep.jpg


5) జస్ప్రీత్ బుమ్రా: ఈ ఏడాది పలు ఆరోగ్య కారణాల వల్ల జస్ప్రీత్ బుమ్రా తన ప్రతిభను పూర్తిగా ప్రదర్శించలేకపోయాడు. బుమ్రా ఈ ఏడాది మొత్తం 13 టీ20 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. ఇతర దేశాల్లో ఆడినపుడు బుమ్రా ప్రభావం స్పష్టంగా కనిపించింది. పరుగుల నియంత్రించడంతో పాటు వికెట్లు తీయడంలో బుమ్రా సామర్థ్యం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.

bumrah.jpg


ఇవి కూడా చదవండి..

అందరికీ ఇలాంటి బాస్ ఉండాలి.. ఉద్యోగులకు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌ల గురించి తెలిస్తే..

కూతురిని ఇంట్లో ఉంచి బయటకెళ్లిన తండ్రి.. తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 22 , 2025 | 09:08 PM