Share News

Year Ender 2025 Indian cricket: ఈ ఏడాది భారత జట్లు సాధించిన చిరస్మరణీయ విజయాలు ఇవే..

ABN , Publish Date - Dec 23 , 2025 | 08:47 PM

ఈ ఏడాది భారత పురుషుల జట్టు రెండు మేజర్ టోర్నీలలో విజేతగా నిలిచింది. అలాగే మహిళా క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇక, మహిళల అంధ జట్టు కూడా టీ20 ప్రపంచకప్ దక్కించుకుని క్రికెట్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.

Year Ender 2025 Indian cricket: ఈ ఏడాది భారత జట్లు సాధించిన చిరస్మరణీయ విజయాలు ఇవే..
India cricket success

2025 భారత క్రికెట్ చరిత్రలో ఓ మరపురాని సంవత్సరంగా మిగిలిపోతుంది. భారత పురుషుల జట్టు రెండు మేజర్ టోర్నీలలో విజేతగా నిలిచింది. అలాగే మహిళా క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇక, మహిళల అంధ జట్టు కూడా టీ20 ప్రపంచకప్ దక్కించుకుని క్రికెట్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది (India cricket titles 2025).


ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC trophies India 2025)

champions.jpg

భారత పురుషుల జట్టు దుబాయ్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. టోర్నమెంట్ అంతటా భారత్ అజేయంగా నిలిచింది. ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి పాలవకుండా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.


పురుషుల ఆసియా కప్-2025

asia-cup.jpg

దుబాయ్‌లోనే జరిగిన ఆసియా కప్‌లో భారత యువ జట్టు సత్తా చాటింది. ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ జట్లు మూడుసార్లు తలపడ్డాయి. ఈ మూడు సార్లూ టీమిండియానే విజయం సాధించడం విశేషం. ఫైనల్ మ్యాచ్‌లో మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుత అర్ధశతకం సాధించి టీమిండియాను గెలిపించాడు.


మహిళల ప్రపంచ కప్- 2025

womens.jpg

ఈ ఏడాది భారత్ మహిళా క్రికెట్ చరిత్రలో ఓ చిరస్మరణీయ సంవత్సరం. నవంబర్ 2న ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత మహిళా జట్టు తొలిసారి ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 299 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం దక్షిణాఫ్రికా 246 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకుంది.


మహిళల అంధుల T20 ప్రపంచ కప్

blind.jpg

కొలంబోలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడించిన భారత మహిళా అంధుల జట్టు తమ తొలి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ముందుగా బౌలింగ్ వేసిన భారత్.. నేపాల్‌ను 114/5కి పరిమితం చేసింది. అనంతరం కేవలం 12 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయం దేశవ్యాప్తంగా ఉన్న వికలాంగ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచింది.


ఇవి కూడా చదవండి..

ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.. కారు వెనుక స్టిక్కర్ మీద ఏం రాసి ఉందో చదివితే..


ప్రాణం కంటే రీల్ ముఖ్యమా.. ఈ అమ్మాయి ప్రమాదకర స్టంట్ చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 23 , 2025 | 08:47 PM