viral girl video: ప్రాణం కంటే రీల్ ముఖ్యమా.. ఈ అమ్మాయి ప్రమాదకర స్టంట్ చూడండి..
ABN , Publish Date - Dec 23 , 2025 | 05:14 PM
సోషల్ మీడియా వ్యూస్ కోసం కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (reels obsession).
itsaartisahu అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక అమ్మాయి బైక్ మీద ప్రాణాంతక సాహసాలు చేస్తోంది. ఒక వీడియోలో, ఆమె 'జానీ-జానీ' పాటకు నటిస్తూ రీల్ చేస్తోంది. ఈ సమయంలో ఆమె బైక్ హ్యాండిల్ వదిలి, పాటకు అనుగుణంగా డ్యాన్స్ వేసింది. ఆ సమయంలో బైక్ వేగంగా ముందుకు వెళ్తోంది. అలాగే మరో రెండు వీడియోలు కూడా రూపొందించింది. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి (Instagram reels craze).
ఆ వీడియోలు వైరల్ అయి స్థానిక పోలీసుల దృష్టికి వెళ్లాయి (shocking bike stunt). దీంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా వ్యూస్ కోసం పిస్టల్స్ పట్టుకుని ఫోటోలకు ఫోజులివ్వడం, బైక్ స్టంట్‌లు చేయడం వంటివి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. దీంతో సదరు ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆ వీడియోలను డిలీట్ చేసింది.
ఇవి కూడా చదవండి..
అందరికీ ఇలాంటి బాస్ ఉండాలి.. ఉద్యోగులకు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌ల గురించి తెలిస్తే..
కూతురిని ఇంట్లో ఉంచి బయటకెళ్లిన తండ్రి.. తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..