Share News

Maruti Alto sticker: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.. కారు వెనుక స్టిక్కర్ మీద ఏం రాసి ఉందో చదివితే..

ABN , Publish Date - Dec 23 , 2025 | 03:32 PM

ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే ఆసక్తికర, ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Maruti Alto sticker: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.. కారు వెనుక స్టిక్కర్ మీద ఏం రాసి ఉందో చదివితే..
desi creativity

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే ఆసక్తికర, ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (car sticker goes viral).


bearys_in_dubai అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కర్ణాటకలోని రోడ్లపై తిరుగుతున్న మారుతి ఆల్టో కారు కనిపిస్తోంది. ఆ కారు వెనుక భాగంలో అతికించిన స్టిక్కర్ చాలా మందికి విపరీతంగా నవ్వు తెప్పిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఏకంగా ఐదు కోట్ల మంది ఆ వీడియోను వీక్షించారు. 33 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు (Maruti Alto owner creativity).


ఇంతకీ ఆ కారు వెనుక ఏముందంటే.. 'దయచేసి దూరం పాటించండి.. ఈ కారు ఈఎమ్‌ఐ పెండింగ్‌లో ఉంది' అని స్టిక్కర్ మీద రాశాడు (viral car message). సాధారణంగా చాలా వాహనాల వెనుక భాగంలో ట్రాఫిక్ నిబంధనలు గురించిన హెచ్చరికలు ఉంటాయి. అయితే ఇతడు ఫన్నీగా రాసిన విధానం చాలా మందిని ఆకట్టుకుంటోంది. చాలా మంది ఆ స్టిక్కర్‌ మీద రాసిన కోట్‌తో తమను తాము రిలేట్ చేసుకుంటున్నారు. ఈ వీడియోను కర్ణాటకలోని మంగళూరు సర్క్యూట్ హౌస్ రోడ్డులో చిత్రీకరించారు.


ఇవి కూడా చదవండి..

అందరికీ ఇలాంటి బాస్ ఉండాలి.. ఉద్యోగులకు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌ల గురించి తెలిస్తే..

కూతురిని ఇంట్లో ఉంచి బయటకెళ్లిన తండ్రి.. తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 23 , 2025 | 03:32 PM