Year Ender 2025 : రాచకొండ పరిధిలో పెరిగిన క్రైమ్: సీపీ సుధీర్ బాబు
ABN , Publish Date - Dec 22 , 2025 | 01:34 PM
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాచకొండ కమినరేట్ పరిధిలో చోటు చేసుకున్న నేరాలను సీపీ సుధీర్ బాబు వివరించారు.
హైదరాబాద్, డిసెంబర్ 22: ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. ఈ ఏడాది(2025)లో 33,040 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతేడాది 28,626 కేసులు నమోదయ్యాయని వివరించారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందన్నారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో 2025లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన నేరాల వార్షిక నివేదికను సీపీ సుధీర్ బాబు వివరించారు.
కిడ్నాప్, ఫోక్స్ కేసులు సంఖ్య భారీగా పెరిగాయని చెప్పారు. ఈ ఏడాది కిడ్నాప్‌లు 579 కేసులు.. ఫోక్సో చట్టం కింద 1,224 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే మర్డర్ ఫర్ గెయిన్ 3, దోపిడీ 3, దొంగతనాలు 67, ఇళ్లలో చోరీ 589 , వాహనాల చోరీ 876 , సాధారణ చోరీలు 1,161, హత్యలు 73, అత్యాచారాలు 330, వరకట్నం చావులు 12, గృహ హింస కింద 782 కేసులు నమోదయినట్లు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే మహిళలపై నేరాల సంఖ్య 4 శాతం పెరిగిందన్నారు.
ఈ ఒక్క ఏడాదిలో రూ.20 కోట్ల డ్రగ్స్..
ఈ ఏడాది రూ. 20 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో మొత్తం 668 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 256 డ్రగ్స్ కేసులు నమోదు చేశారు. అందులో 2,090 కిలోల గంజాయి, 35 కిలోల గంజాయి చాకలెట్లు, 34 కేజీల హ్యాష్ ఆయిల్, 216 గ్రాముల MDMA, 10 కిలోల OPM, 242 గ్రాముల హెరాయిన్, 35 కిలోల గసాగసల సామాగ్రి సీజ్ చేశారు.
ఎక్సైజ్ యాక్ట్ కింద..
ఈ ఏడాది ఎక్సైజ్ యాక్ట్ కింద 656 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 689 మంది అరెస్ట్ కాగా.. 6,824 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
గేమింగ్ యాక్ట్ కింద..
ఈ ఏడాది గేమింగ్ యాక్ట్ కింద 227 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసుల్లో 1,472 మంది అరెస్ట్ కాగా.. రూ. 69 లక్షల ప్రాపర్టీ సీజ్ చేశారు.
మానవ అక్రమ రవాణా కేసులో..
ఈ ఏడాదిలో 73 కేసులు నమోదు చేశారు. 8 స్థావరాలు గుర్తించారు.
జైలు శిక్ష..
ఈ ఏడాది 5,647 కేసుల్లో 146 మందికి జైలు శిక్ష ఖరారైంది. గత ఏడాదితో పోలిస్తే 74% కన్విక్షన్ రేటు పెరిగింది.
స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT)..
ఈ ఏడాది 186 డ్రగ్స్ కేసుల్లో 356 మంది అరెస్ట్ అయ్యారు.
సైబర్ క్రైమ్..
గతేడాదితో పోలిస్తే సైబర్ క్రైమ్ కేసులు తగ్గాయి. 2024లో 4,618 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 3,734 కేసులు నమోదయ్యాయి. ఆపరేషన్ ముస్కాన్ కింద 2,479 మందిని రెస్క్యూ చేశారు. ఆపరేషన్ స్మైల్ కింద 1,071 మంది రెస్క్యూ చేశారు.
రోడ్డు భద్రత..
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగాయి. గత ఏడాది 3,207 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 3,488 కేసులు నమోదయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో 659 మంది మృరణించారు. ORRపై జరిగిన ప్రమాదాల్లో 37 మంది మృతి చెందారు.
డ్రంక్ అండ్ డ్రైవ్..
ఇందులో 17,760 కేసులు నమోదు కాగా.. రూ.3.89 కోట్లు జరిమానా వసూలు చేశారు. 5,821 మంది వాహనదారుల లైసెన్సులు రద్దు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ జన్మదినం వేళ.. వైసీపీ కార్యకర్తల వికృత చేష్టలు
For More Telugu News