International Yoga Day: హిస్టరీ రాయాలన్న..ఏ రికార్డు బ్రేక్ చేయాలన్న మోదీకే సాధ్యం.. యోగాంధ్రలో సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 21 , 2025 | 08:29 AM
CM Chandrababu Yogandhra speech: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వైజాగ్ సాగర తీరంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'యోగాంధ్ర' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. యోగాను ప్రపంచానికి పరిచేసిందే ప్రధాన మంత్రి మోదీ అని అన్నారు.
CM Chandrababu Yogandhra speech:11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) విశాఖ సాగర తీరంలో ఘనంగా ఆరంభమైంది. ఈ సందర్భంగా సందర్భంగా వైజాగ్ సాగర తీరంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'యోగాంధ్ర' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసగించారు. యోగా విశిష్టతపై మాట్లాడారు. యోగాను ప్రపంచానికి పరిచయం చేసిందే ప్రధాన మంత్రి మోదీ అని.. ఆయన కృషి వల్లే ఈ రోజు 130 దేశాలు యోగా డే నిర్వహిస్తున్నాయని అన్నారు. హిస్టరీ రాయాలన్న..ఏ రికార్డు బ్రేక్ చేయాలన్న మోదీకే సాధ్యమంటూ ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు.