లేని హోదాను కావాలంటే ఎలా జగన్..
ABN, Publish Date - Mar 05 , 2025 | 02:52 PM
Nadendla Manohar: జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రజలే వైసీపీ ఆ అధికారం ఇవ్వలేదని.. స్పీకర్‌పై దుష్ప్రచారం తగదని అన్నారు.
అమరావతి, మార్చి 5: ప్రతిపక్ష సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) అన్నారు. బుధవారం ఏపీ శాసనసభలో మంత్రి మాట్లాడుతూ.. జగన్ (YS Jagan) తనకు లేని హోదాను కావాలని కోరుతున్నారన్నారు. స్పీకర్‌పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘మీరు ఈ హౌస్‌కు కస్టోడియన్. ప్రజలకు సేవచేయడానికి ఈ సభ ద్వారా ఎంతో హుందాగా వ్యవహరించి రాష్ట్ర వ్యప్తంగా ప్రజలకు మేలు చేయాలి. సభలో కార్యక్రమాలు , ప్రోసీజర్స్ గురించి పూర్తి అధికారం మీకే ఉంది. అక్కడికి వచ్చి కూర్చోవలసిన ప్రతిపక్ష సభ్యులు, వారి నాయకుడు వారి బాధ్యతను విస్మరించి.. లేని అధికారం కోరుకోవడం దురదృష్టకరం. ప్రజలే మీకు ఆ అధికారం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరు ఏం చేయగలుగుతారు. ప్రతిపక్షంగా వారికి రావాల్సిన మినిమం నెంబర్ రాలేదు గనుక మీరు రూలింగ్ ఇచ్చారు. మీరు ఆ రూలింగ్‌తో పాటు దీన్ని సభాహక్కుల కమిటీకి రిఫర్ చేయాలని జనసేన నుంచి కోరుతున్నాం’’అని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
Karimnagar: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో.. బీజేపీ ముందంజ
Read Latest AP News And Telugu News
Updated at - Mar 05 , 2025 | 02:52 PM