భార్య వేధింపులు.. మరో ప్రాణం బలి..

ABN, Publish Date - Jan 02 , 2025 | 01:35 PM

దేశ రాజధానిలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య వేధింపులతో ఓ కేఫ్ యజమాని ఆత్మహత్య చేసుకోవడం ఢిల్లీ(Delhi)లో తీవ్ర కలకలం రేపుతోంది. ఉడ్‌బాక్స్ కేఫ్(Woodbox Cafe) యజమాని పునీత్(Puneet) తన గదిలో బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య వేధింపులతో ఓ కేఫ్ యజమాని ఆత్మహత్య చేసుకోవడం ఢిల్లీ (Delhi)లో తీవ్ర కలకలం రేపుతోంది. ఉడ్‌బాక్స్ కేఫ్ (Woodbox Cafe) యజమాని పునీత్ (Puneet) తన గదిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య మానిక (Manika) వేధిస్తుండడంతో భరించలేని పునీత్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు రెండేళ్ల నుంచీ కోర్టులో నడుస్తోంది. అయితే కేఫ్ యాజమాన్యం విషయంలోనూ వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి సంభాషణలకు సంబంధించిన ఆడియో క్లిప్ సైతం సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది. తనకు రావాల్సిన మెుత్తం ఇవ్వాల్సిందే అని మానిక డిమాండ్ చేసినట్లు ఆడియో క్లిప్ ద్వారా తెలుస్తోంది. భార్య మానిక వేధింపులు తట్టుకోలేక పునీత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన బెంగళూరు టెకీ సైతం భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా మరో ఘటనతో భార్య వేధింపుల విషయంపై తీవ్ర చర్చ నడుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నటి హేమకు బెంగుళూరు హైకోర్టులో ఊరట...

కొడిగుడ్డు కొనేటట్టు లేదు..తినేటట్టు లేదు..

ఏబీఎన్ చేతికి ఆదినారాయణపై దాడి దృశ్యాలు

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 02 , 2025 | 01:39 PM