Mir Chowk ACP: మీర్‌చౌక్ ఏసీపీపై లైంగిక ఆరోపణలు
ABN, Publish Date - Dec 07 , 2025 | 05:24 PM
మీర్‌చౌక్ ఏసీపీ శ్యాం సుందర్ వేధిస్తున్నారంటూ మహిళ మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్‌లో అసభ్యకర మెసేజ్ లు పెడుతున్నారని, ఒంటరిగా రావాలని వేధిస్తున్నారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 07: నగరంలోని మీర్‌చౌక్ ఏసీపీ పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. ఏసీపీ శ్యాం సుందర్ వేధిస్తున్నారంటూ మహిళ మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్‌లో అసభ్యకర మెసేజ్ లు పెడుతున్నారని, ఒంటరిగా రావాలని వేధిస్తున్నారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ కేసు విషయంలో న్యాయం చేయాలని ఆయన్ను కలసిశానని తెలిపింది. అయితే అప్పటి నుంచి కేసు అడ్డు పెట్టుకొని తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ సదరు మహిళ ఆరోపణలు చేసింది. తాను చెప్పినట్లు వింటేనే న్యాయం చేస్తానని పోలీసులతో బెదిరిస్తు్న్నట్లు ఆమె తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శాప్‌తో ఏసీఏ కలిసి అన్ని క్రీడలు ప్రోత్సహించేలా కృషి: ఎంపీ కేశినేని చిన్ని
హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు: విజయసాయిరెడ్డి
For More TG News And Telugu News
Updated at - Dec 07 , 2025 | 05:24 PM