చెప్పిన మాటకు కట్టుబడని నేత..
ABN, Publish Date - Apr 21 , 2025 | 09:30 AM
విజయసాయి రెడ్డి తన పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. తాను రావాలంటే తిరిగి రాజకీయాల్లోకి వస్తానని తేల్చి చెప్పారు. దీంతో గతంలో చెప్పిన మాటకు విజయసాయి ఏమాత్రం కట్టుబడి ఉండడంలేదని మరోసారి రుజువైంది. ఈ నేత తాజా కామెంట్సే రాజకీయ పున:ప్రవేశాన్ని నిర్ధారిస్తున్నాయని టాక్ నడుస్తోంది.
వైసీపీ పాలనలో చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఈ ఏడాది జనవరిలో పార్టీకి రాజీనామా చేశారు. అప్పట్లో ఇక రాజకీయాల్లోకి రాను, వ్యవసాయం చేసుకుంటానని కొత్త పలుకులు పలికారు. అందరూ నిజమే కాబోలు అనుకున్నారు. కానీ ఈ మధ్య ఆయన స్వరం మారింది. తన పొలిటికల్ రీ ఎంట్రీ (Policical re-entry)పై క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు రాజకీయాల్లోకి మళ్లీ రావాలనుకుంటే తనకు ఎవరి పర్మిషన్ అవసరం లేదని కుండబద్దలుకొట్టారు. ఎవరూ ఆపలేరని అంతా తన ఇష్టమని డైలాగ్ దంచారు. తాను రావాలంటే తిరిగి రాజకీయాల్లోకి వస్తానని తేల్చి చెప్పారు. దీంతో గతంలో చెప్పిన మాటకు విజయసాయి ఏమాత్రం కట్టుబడి ఉండడంలేదని మరోసారి రుజువైంది. ఈ నేత తాజా కామెంట్సే రాజకీయ పున:ప్రవేశాన్ని నిర్ధారిస్తున్నాయని టాక్ నడుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: భారత్ పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు
ఈ వార్తలు కూడా చదవండి..
డోనాల్డ్ ట్రంప్ తీరుపై స్పందించిన భారత్..
చైనా సరికొత్త హైడ్రోజన్ బాంబు
For More AP News and Telugu News
Updated at - Apr 21 , 2025 | 09:30 AM