Share News

భారత్‌ పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు

ABN , Publish Date - Apr 21 , 2025 | 08:55 AM

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ సోమవారం భారత్ పర్యటనకు రానున్నారు. భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వాన్స్ చర్చలు జరుపుతారు. చర్చల అనంతరం జేడీవాన్స్ దంపతులకు ప్రధాని మోదీ విందు ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల భారత్ పర్యటనలో పలు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను జేడీవాన్స్ దంపతులు సందర్శించనున్నారు.

భారత్‌ పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు
US Vice President India tour

న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీవాన్స్‌ (JD Vance) సోమవారం భారత్ పర్యటనకు (India tour) రానున్నారు. తన సతీమణి ఉషావాన్స్‌‌ (Ushawans)తో కలిసి భారత్‌లో పర్యటిస్తారు. ఈనెల 24 వరకు ఆయన పర్యటన కొనసాగుతుంది. అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం జేడీవాన్స్‌ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. సోమవారం సాయంత్రం ఆయన ఢిల్లీ (Delhi)కి చేరుకుంటారు. విమానాశ్రయంలో ఆయనకు సీనియర్ కేంద్ర మంత్రి స్వాగతం పలుకుతారు. సాయంత్రం 6-30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నివాసానికి జేడీ వాన్స్ వెళతారు. భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై మోదీతో వాన్స్ చర్చలు జరుపుతారు. చర్చల అనంతరం జేడీవాన్స్ దంపతులకు ప్రధాని మోదీ విందు ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల భారత్ పర్యటనలో పలు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను జేడీవాన్స్ దంపతులు సందర్శించనున్నారు.

Also Read..: జనవాణి పనివేళల్లో మార్పు..


ఈ వార్తలు కూడా చదవండి..

డోనాల్డ్ ట్రంప్ తీరుపై స్పందించిన భారత్..

చైనా సరికొత్త హైడ్రోజన్‌ బాంబు

For More AP News and Telugu News

Updated Date - Apr 21 , 2025 | 08:55 AM