Tungabhadra Dam: తుంగభద్రకు భారీ వరద నీరు.. 20 గేట్లు ఎత్తివేత
ABN, Publish Date - Jul 04 , 2025 | 01:50 PM
తుంగభద్ర ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు తుంగభద్ర డ్యామ్ 20 గేట్లను ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తుంగభద్ర ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు తుంగభద్ర డ్యామ్ 20 గేట్లను ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుతం 1625.4 అడుగులకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 28932 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ఫ్లో 62766 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి స్తాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 78.01 టీఎంసీల నీరు ఉన్నట్లు వివరించారు.
Updated at - Jul 04 , 2025 | 01:50 PM