బీఆర్ఎస్ ప్రయత్నం ఇదే: మహేష్ కుమార్ గౌడ్
ABN, Publish Date - Feb 06 , 2025 | 06:26 PM
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సీఎల్పీ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తెలిపారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే పలు అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం చేశారు.
సీఎల్పీ భేటీ అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణను పకడ్బందీగా చేశామని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందన్నారు.
Updated at - Feb 06 , 2025 | 06:28 PM