Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో జలప్రళయానికి కారణాలు ఇవే ..!

ABN, Publish Date - Aug 06 , 2025 | 09:40 PM

ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే గ్రామం ధరాలి.. ఒక్కసారిగా వరద, బురదలో కొట్టుకుపోయింది. యాపిల్స్‌కు ప్రసిద్ధిచెందిన హర్షిల్ లోయ సమీపంలో ఉందీ గ్రామం. గంగోత్రి ధామాన్ని దర్శించేవాళ్ల కాసేపు విడిది కోసం మార్గమధ్యలో ఉన్న గ్రామానికి వస్తుంటారు. సమీపంలో భాగీరథీ నది ప్రవహిస్తోంది..

ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే గ్రామం ధరాలి.. ఒక్కసారిగా వరద, బురదలో కొట్టుకుపోయింది. యాపిల్స్‌కు ప్రసిద్ధిచెందిన హర్షిల్ లోయ సమీపంలో ఉందీ గ్రామం. గంగోత్రి ధామాన్ని దర్శించేవాళ్ల కాసేపు విడిది కోసం మార్గమధ్యలో ఉన్న గ్రామానికి వస్తుంటారు. సమీపంలో భాగీరథీ నది ప్రవహిస్తోంది.


చార్‌ధామ్ యాత్ర, ఇతర ఉత్సవాల సమయంలో జనం పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. అందుకే ధరాలి గ్రామం చిన్నదే అయినా.. కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతుంటాయి. యాత్రికుల కోసం విచ్చలవిడిగా లాడ్జిలను నిర్మించారు. తక్కువ ధరలకే విడిది సౌకర్యాలు లభిస్తుండడంతో సందర్శకులు, భక్తులు, యాత్రికులు.. ఈ గ్రామంలో విశ్రాంతి తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. సముద్రమట్టానికి దాదాపు 2, 680 మీటర్ల ఎత్తులో ఈ ధరాలీ గ్రామం ఉంది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Aug 06 , 2025 | 09:40 PM