పాకిస్తాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు...

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:59 PM

తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ పాకిస్తాన్ సమాచార మంత్రి అతౌల్లా తరార్ మొసలి కన్నీరు కార్చారు. పహల్గామ్ దాడిపై తటస్థ, పారదర్శక, స్వతంత్ర దర్యాప్తునకు సహకరిస్తామని ప్రకటించినప్పటికీ భారత్ సైనిక చర్యకు సిద్ధమవుతోందని ఆరోపించారు.

జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) పహెల్గామ్ ఉగ్రదాడితో (Pahalgam terror attack) భారత్ (India), పాక్ (Pakistan) సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు (Tensions) ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సమాచార మంత్రి అతౌల్లా తరార్ (Pakistan Information Minister Ataullah Tarar) కీలక వ్యాఖ్యలు (Key comments) చేశారు. పాక్‌పై సైనిక చర్యకు భారత్ ప్రాణాళికలు రచిస్తోందన్నారు. మరో 24 గంటల నుంచి 36 గంటల్లో పాక్‌పై దాడి జరగవచ్చునని అన్నారు. నిరాధార ఆరోపణ ఆధారంగా పాక్‌పై దాడి చేయడానికి భారత్ సిద్ధమవుతున్నట్లు పాక్ మంత్రి ఆరోపించారు.

Also Read: వేసవి సెలవులకు ముందే గ్రూప్ 1 వివాదంఫై ఆదేశాలు ఇవ్వాలి..


తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ పాక్ మంత్రి మొసలి కన్నీరు కార్చారు. పహల్గామ్ దాడిపై తటస్థ, పారదర్శక, స్వతంత్ర దర్యాప్తునకు సహకరిస్తామని ప్రకటించినప్పటికీ భారత్ సైనిక చర్యకు సిద్ధమవుతోందని ఆయన ఆరోపించారు. అయితే భారత్ చర్యకు ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని అతౌల్లా తరార్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపదర్శనం..

PM Modi: గోడ కూలి ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం..

సింహాచలం ఘటనపై కేటీఆర్ స్పందన..

For More AP News and Telugu News

Updated at - Apr 30 , 2025 | 12:59 PM