తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం
ABN, Publish Date - Feb 06 , 2025 | 04:11 PM
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలుగు సినిమా దినోత్సం సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై ప్రతి ఏడాది ఫిబ్రవరి 6న అవార్డులు ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 6: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలుగు సినిమా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు చరిత్ర రాబోయే తరాలకు తెలియాలని తెలుగు సినిమా దినోత్సవం జరుపుతున్నామని ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడంతో పాటు ఆ ఏడాది ప్రతిభావంతులకు, పద్మా అవార్డు గ్రహితలను సన్మానిస్తామని తెలిపారు. ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయన్నారు. ఇకపై ప్రతి ఏడాది ఫిబ్రవరి 6న అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలుగు సినిమా పుట్టిన రోజున నటుల ఇళ్లు, థియేటర్ల దగ్గర ప్రత్యేకంగా జెండాలను ఆవిష్కరించాలని ఛాంబర్ నిర్ణయించిదన్నారు. గద్దర్ అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం ప్రొ ఆక్టివ్‌గా ఉంటోందని దామోదర్ ప్రసాద్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
CLP Meeting: సీఎల్పీ మీటింగ్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ ఆహ్వానం
Mastan Sai: మస్తాన్ సాయిని కస్టడీకి కోరిన పోలీసులు..
Read Latest Telangana News And Telugu News
Updated at - Feb 06 , 2025 | 04:11 PM